歌词
మెల్లగా తెల్లారిందోయ్ అల
వెలుతురే తెచ్చేసిందోయ్ ఇల
బోసి నవ్వులతో మెరిసే పసి పాపల్లా
చేదతో బావులలో గలగల
చెరువులో బాతుల ఈతల కళ
చేదుగా ఉన్నా వేపను నమిలేవేళా
చుట్ట పొగ మంచుల్లో
చుట్టాల పిలుపుల్లో
మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయంలా
చలిమంటలు ఆరేలా
గుడిగంటలు మోగేలా
సుప్రభాతాలే వినవేలా
గువ్వలు వచ్చే వేళ
నవ్వులు తెచ్చే వేళ
స్వాగతాలవిగో కనవేలా
పొలమారే పొలమంతా ఎన్నాళ్ళో నువు తలచీ
కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువు విడచీ
మొదట అందని దేవుడి గంట
మొదటి బహుమతి పొందిన పాట
తాయిలాలకు తహతహలాడిన పసితనమే గురుతొస్తోందా
ఇంతకన్నా తీయ్యనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాన
నువ్వూగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల నువ్వెదిగిన ఎత్తే కనబడకా
నువ్వాడిన దొంగాట బెంగల్లే మిగలాల తన్నెవరు వెతికే వీల్లేకా
కన్నులకే తియ్యదనం రుచి చూపే చిత్రాలే
సవ్వడితో సంగీతం పలికించే శలయేళ్ళే
పూల చెట్టుకి ఉందో భాష
అలల మెట్టుకి ఉందో భాష
అర్థమవ్వనివాళ్ళే లేరే అందం మాటాడే భాష
పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష
మమతలు పంచే ఊరూ ఏమిటి దానికి పేరూ పల్లెటూరేగా ఇంకెవరూ
ప్రేమలు పుట్టిన ఊరూ అనురాగానికి పేరూ కాదనేవారే లేరవరూ
专辑信息
1.Mellaga Tellarindoi
2.Naalo Nenu
3.Nilavade
4.Shatamanam Bhavati