歌词
ఎవ్వరితో చెప్పను?
ఎక్కడని వెతకను?
మనసు ఏదనీ?
నిను చేరే ఆశతో
ఎదురీదే శ్వాసతో
గాలిలో తిరుగుతూ
ఉందనీ ఎవరితో చెప్పను?
క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది
క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది
~ సంగీతం ~
నిను మరువదే తలపు
వెనుదిరగదే చూపు
కనబడనిదే రేపు
నమ్మడమెలా..
నువ్వు కలవేనని?
కంటపడవా.. ఉన్నానని?
క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది
~ సంగీతం ~
నను తరుముతూ
సమయం నిను తడుముతూ హృదయం
ఎటు నడపను పయనం
ఎంతవరకూ..
ఇలా కొనసాగను?
ఏ మలుపులో.. నిను చూడను?
క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది
క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది
专辑信息