歌词
作词:Vennelakanti
作曲:D. Imman
చిన్నదాని లేడి వయసే కురిసింది వెన్నెల
జాజిపూల మోజులోన మరిపించే నన్నిల
చిన్నదాని లేడి వయసే కురిసింది వెన్నెల
జాజిపూల మోజులోన మరిపించే నన్నిల
సందెవేళ జారి పోకే రా చిలకా
పందెవేసి నీకై వచ్చా కాదనకా
వద్దకొస్తే వద్దనకా
చిన్నదాని లేడి వయసే కురిసింది వెన్నెల
జాజిపూల మోజులోన మరిపించే నన్నిలా
చిన్నదాని లేడి వయసే కురిసింది వెన్నెల
జాజిపూల మోజులోన మరిపించే నన్నిలా
మంతరించిపోయే ఏదో గారడి చేసితివే
మంతనాలు ఆడి పాడి ఆరడి పెట్టితివే
ఓర కంటి చూపుకే ఉరికొచ్చె ఆమని
గుండెల్లోన ఆశలే కుమ్మరించె నాకని
ఏమి చితరమో నిన్ను వదిలి బతకలేనులే
కళ్ళ కత్తెరతో నొక్కి వేస్తే తాళలేనులే
హద్దు దాటాలి ముద్దులోన
చిన్నదాని లేడి వయసే కురిసింది వెన్నెల
జాజిపూల మోజులోన మరిపించే నన్నిలా
ఆకాశాన ఊగి పోయే గువ్వల్లే సాగుదామా
కాలమాగిపోయే వేళ కౌగిళ్ళ తాగుదామా
ఇచ్చకాల అందమే ఇచ్చుకున్న భావన
పచ్చిపాల ఈడునే పంచుకున్న లాలనా
కోటి ఆశలతో వచ్చినాను నిన్ను చేరగా
కలల వెన్నెలలో కరుగుదాము దాహమారగా
హద్దు దాటాలి ముద్దులోన
చిన్నదాని లేడి వయసే కురిసింది వెన్నెల
జాజిపూల మోజులోన మరిపించే నన్నిలా
సందెవేళ జారి పోకే రా చిలకా
పందెవేసి నీకై వచ్చా కాదనకా
వద్దకొస్తే వద్దనకా
చిన్నదాని లేడి వయసే కురిసింది వెన్నెల
జాజిపూల మోజులోన మరిపించే నన్నిలా
专辑信息