歌曲 / 歌词

Megham Tho Megham

Listen on Apple Music

歌词

మేఘం తో మేఘం మురిసే
వానల్లే మారే వరసే
తీరంతో కడలేమో కలిసే
ఆనందం ఆలలా ఎగిసే
ఏ చోట వేరే కాలేని తీరే
ఓ జతగా నడిచే జగమే విడిచే
చుట్టూరా ఎవరు ఉన్నారో కనరు
ఉంటారే ఎపుడు ఎవరు లేనట్టు
అరె అరెరే అరెరే అరెరే
ఎదురెదురు నిలిచే కనులే
అరె అరెరే అరెరే అరెరే
ఎటువైపో ఎగిరే ఎదలో
♪
పాదం ఆగింది ఏమైందని
గమ్యం చేరిందో ఏమో మరి
చూస్తూ చూస్తూనే ఓ మాయలా
చూపే సాగింది ఓ నీడలా
కనులే వెళుతుంటే దూరంగానే
కలలే ఆగాయి ఓ చోటనే
ఏమో ఏమైందో అంటే మరి
బదులంటూ లేదే ఈ ప్రశ్నకి
అరె అరెరే అరెరే అరెరే
పరిచయమే ఇపుడే మొదలా
అరె అరెరే అరెరే అరెరే
కడవరకు కదిలే కధలా
♪
అంతే లేనంత సంతోషమే
అంతా అయిపోయే నీ సొంతమే
జాడేలేదంట ఏకాంతమే
తోడై చేరాక ఈ బంధమే
ఎదలో వేరంటే పైపై మాటే
కలిసే ఈ జంట శ్వాసించనే
దూరం రానంది మీ వైపుకే
కాలం ఆగింది మీ రాకకే
అరె అరెరే అరెరే అరెరే
(అరె అరె అరే)
ఎదురుపడే వెతికే నిధులే
(అరె అరెరే)
అరె అరెరే అరెరే అరెరే
(అరె అరెరే)
కడలి ఓడే ఒదిగే నదులే