歌词
రెండు కళ్ళ నిండా నిండిపోయినావే
రంగు రంగు కలలే రప్పించుతున్నావే
♪
గుండెలోకి వచ్చి వెళ్ళనంటావే
కొత్త కొత్త ఊహలు తెప్పించుతున్నావే
♪
నన్ను గిల్లే గిల్లే గిల్లే గాలి కెరటం నువ్వే నువ్వే నువ్వే
నన్ను అల్లే అల్లే అల్లే పూల వర్షం నీదే నీదే నీదే
ఎపుడు లేనంత ఎదురు చూస్తోంది నిదుర పోకుండ ప్రాణం
మొదటి సారేమో అదుపు దాటింది నాలో నాలో హృదయం
రెండు కళ్ళ నిండా నిండిపోయినావే
రంగు రంగు కలలే రప్పించుతున్నావే
♪
రెండు రెళ్ళు నాలుగు అనడం లెక్కల్లోన వింటాం
నాలుగు కళ్ళు ఒకటైపోడం ప్రేమలోనే చూస్తాం
ప్రపంచంలో వింతలు అంటే ఏడు అనే అంటాం
అంతులేని వింతలు ఎన్నో ప్రేమకేగా సొంతం
భూమికున్న ఆకర్షణనే పుస్తకాల్లో చదివుంటాం
అంతకన్నా ఆకర్షణని ప్రేమలోనే కనుగొంటాం
అరె నవ్వే నవ్వే నవ్వే ఇంద్రధనుసు నువ్వే నువ్వే నువ్వే
నిన్ను కోరే కోరే కోరే పిచ్చి మనసు నాదే నాదే నాదే
ఇసుక వేస్తుంటే రాలిపోనంత దగ్గరయ్యింది దూరం
గాలి దూరేంత చోటు లేనంత తపస్సులో మునిగాం
రెండు కళ్ళ నిండా నిండిపోయినావే
రంగు రంగు కలలే రప్పించుతున్నావే
♪
ప్రాణం ఉన్న బొమ్మౌతున్నా నిన్నే నిన్నే చూస్తూ
రాతిరేళ కవినవుతున్నా ఏదో ఏదో రాస్తూ
రాను రాను దొంగవుతున్నా నాలో నిన్నే దాస్తూ
అమాంతంగా దొరనవుతున్నా నన్నే నీకు ఇస్తూ
చంటిపాపనైపోతున్నా నువ్వు బుజ్జగిస్తుంటే
మహారాణి అయిపోతున్నా మరీ పొగుడుతువుంటే
నాకు వచ్చే వచ్చే వచ్చే ఆదమరుపు నువ్వే నువ్వే నువ్వే
నాకు నచ్చే నచ్చే నచ్చే కొత్త పిలుపు నీదే నీదే నీదే
మలుపుకో హాయి పలకరిస్తుంటే పులకరిస్తోంది ప్రాయం
వలపులో ఇన్ని మెరుపులే ఉంటే తెలీదులే సమయం
రెండు కళ్ళ నిండా నిండిపోయినావే
రంగు రంగు కలలే రప్పించుతున్నావే
♪
గుండెలోకి వచ్చి వెళ్ళనంటావే
కొత్త కొత్త ఊహలు తెప్పించుతున్నావే