歌词
ప్రాణం పరవనా
అడుగే వేసేయ్ ముందుగా
పాదం కలపనా అదుపే లేని ఆశగా
నా ఈ జననమే ఇలా నీ కోసం జరిగెనే
నన్నే మరణమే హరించే దాక వదలనే ఓ
ప్రాణం పరవనా
అడుగే వేసేయ్ ముందుగా
పాదం కలపనా అదుపే లేని ఆశగా
♪
నిందిస్తూ ఉంది నా గుండె
నీ వెంటే లేకుంటే నిత్యం నీకై ఆలోచిస్తుందే
బంధీగా నాలో చేరిందే భద్రంగానే ఉందే
అంతేలేని హాయే నింపిందే
నూరేళ్ళైనా నీలోనే ఉండనివ్వు ఇకపై
నిరూపించుకోనివ్వు ప్రాణంమిచ్చు జతనై
నిశీధే చుట్టూ ఉన్నా
నీ చూపే దీపం అంటూ ఉన్నా
విషాదం కమ్మేట్టున్నా
నీ ప్రేమే పువ్వుల దారంటున్నా ఓ
ప్రాణం పరవనా
అడుగే వేసేయ్ ముందుగా
పాదం కలపనా అదుపే లేని ఆశగా
♪
ప్రేమంటే చెప్పే వీలుంటే
కొలిచేటి దారుంటే నాలో ప్రేమే చూపిస్తానంతే
ప్రేమంటూ లేని చోటంటే చూసేది లేదంతే
ఏనాడైనా నా వెంటే ఉంటే
సంతోషాన్ని సంకెళ్లు వేసి ఉంచు మనకై
సుదూరం ప్రయాణం చెయ్యాలి బ్రతుకు వరమై
ప్రపంచం రానంటున్నా ప్రయాణం నాతో చేసేవమ్మ
ప్రమాదం చెంతే ఉన్నా ప్రేమించే బంధం నువ్వెనమ్మ ఓ
ప్రాణం పరవనా
అడుగే వేసేయ్ ముందుగా
పాదం కలపనా అదుపే లేని ఆశగా