歌曲 / 歌词

Patti Patti

Listen on Apple Music

歌词

పట్టి పట్టి నన్నే సూత్తాంటే
పట్టలేక ఏటో అవ్తాందే
పట్టుపట్టి జోడీ కట్టానే
పట్టలేని హాయే పొందానే
కొంటె పిల్ల నువ్వు
తుంటరోడ్ని నేను
రాధ ఎంట కిష్టుడ్నే
కోట రాణి నువ్వు
తోటమాలి నేను
నీకు తగ్గ ఈరుడ్నే
జట్టు కట్టు సేపట్టు
ఒగ్గేయ్నే నీ మీదే ఒట్టు
రాములోరైనా సీతతోటే ఉన్నా
సూడలేదు లోకం అదేటో
తుళ్ళి ఆడుతుంటే తట్టుకోదురయ్యో
కుళ్ళుబోతు లోకం కదేటో
ఏ కులము గిలము బలము జూసి
వయసు వరస సరసు సూసి
పుట్టుకొస్తదారా ప్రేమ
మనసు మనసుకు వంతెనేసి
తనువు తనువు మెలికలేసే
తీరేరా ప్రేమ
సిన్నపిల్లలైనా ఏళ్ళు మళ్ళుతున్నా
ప్రేమలోను అంతా ఒకటేగా
లచ్చలెన్ని ఉన్నా డొక్కలాడకున్నా
ప్రేమ లక్షణాలు అవేగా
ఏ ఎతికి ఎతికి సూత్తవి కళ్ళు
కుదురు సెదిరి పోతది కన్ను
జివ్వుమంటదంటా వెన్ను
సిలక పలుకే తానేమన్నా
పులకరింత నేనేం విన్నా
వలపొక వింతేనా
జట్టు కట్టు సేపట్టు
ఒగ్గేయ్నే నీ మీదే ఒట్టు
కస్సు బస్సు లైనా, కొంటె సూపులైనా
కంటికింపులేగా ఏదైనా
సందడెంత ఉన్నా, ముందరెవ్వరున్నా
నింగి అంచులోనే నేనున్నా
అడుగులగుగులేస్తా ఉన్నా
కదల మెదల కుంట ఉన్నా
అంతులేని ప్రేమేమన్నా
మాటలరదలైతా ఉన్నా
మౌనమంత నిండి ఉన్నా
నీతో నేనున్నా
జట్టు కట్టు సేపట్టు
ఒగ్గేయ్నే నీ మీదే ఒట్టు
ప్రేమకు ఉందా పరిధి