歌曲 / 歌词

Bujji Bujji Paapayi

Listen on Apple Music

歌词

బుజ్జి బుజ్జి పాపాయీ బుల్లి బుల్లి పాపాయీ

నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోయీ

పాలుగారు ప్రాయంలో నీలాగే ఉన్నాను
బంగారు ఊయలలో పవళించి ఊగేను
ఆనాటి అచ్చటలే ఈనాటి ముచ్చటలై మనసే మురిసెనురా మమతే పెరిగెనురా
నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోయీ
బుజ్జి బుజ్జి పాపాయీ బుల్లి బుల్లి పాపాయీ
ఒక హృదయం పొంగితే ఉరికేది కవితరా
ఇరు హృదయాలొకటైతే పాడేది లాలిరా
ఒక హృదయం పొంగితే ఉరికేది కవితరా
ఇరు హృదయాలొకటైతే పాడేది లాలిరా
ఏ తల్లి కన్నదో ఏ బంధమున్నదో మనసే మురిసెనురా మమతే పెరిగెనురా
నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోయీ
బుజ్జి బుజ్జి పాపాయీ బుల్లి బుల్లి పాపాయీ
పూవంటి మనసులో ముల్లున్న జగతిరా
మోసాలు ద్వేషాలు ముసిరే బ్రతుకురా
నమ్ముకున్న నావారు నాకిదే నేర్పారు
నమ్ముకున్న నావారు నాకిదే నేర్పారు
పాపాయిగా ఉంటే బాధలే ఉండవురా