歌曲 / 歌词

Gumma Muddu

Listen on Apple Music

歌词

గుమ్మ గుమ్మ ముద్దుగుమ్మ
గుడి మీద బొమ్మే నీదమ్మ
మావా మావా కొత్త మావా
ఒడిలోన సొమ్మే నీదమ్మ
జాణతనం జానపదం చాలుగాని ఆగవే
సీమరతం ప్రేమసుఖం చీకటింట చూపరా
మోజుపడ్డ మోహన రంగ
గుమ్మ గుమ్మ ముద్దుగుమ్మ
గుడి మీద బొమ్మే నీదమ్మ
మావా మావా కొత్త మావా
ఒడిలోన సొమ్మే నీదమ్మ
♪
ఏం లబ్జుగా ఉన్నావే గుజ్జు నా గోపెమ్మ
ఏం వెన్న తినిపిస్తావే వన్నెల రాధమ్మ
కవ్వమే నీవైతే కడవలా పడి ఉంటా
కొండవై ఎదరుంటే గోవునై తోడుంటా
ఊగకే గోపెమ్మ ఊరికే గొబ్బెమ్మ
కాదనకు లేదనకు కౌగిలింత కానుక
కోల సఖి కోల ముఖి ఈల పాట ఉందిగా
వయస్సోకు బంగారమ్మ
మావా మావా కొత్త మావా
ఒడిలోన సొమ్మే నీదమ్మ
గుమ్మ గుమ్మ ముద్దుగుమ్మ
గుడి మీద బొమ్మే నీదమ్మ
♪
నీ మువ్వలా నేనున్నా ముట్టుకో గోపాల
నీ ముద్దుకే చూస్తున్నా ఇచ్చుకో ఇయ్యాల
ఊరికే రాధమ్మ ఊరికే రాకమ్మ
వీధిలో కృష్ణయ్య వీడుగా లేడమ్మ
కోవెల తోటుంది కోరికే చాటంది
చాటు కథ చేటు కదా ఇంటికెళ్ళు బుద్ధిగా
వీడకు ఈ పార్వతిని కొత్త దేవదాసులా
ఇంగిలీసు సింగారయ్య
గుమ్మ గుమ్మ ముద్దుగుమ్మ
గుడి మీద బొమ్మే నీదమ్మ
మావా మావా కొత్త మావా
ఒడిలోన సొమ్మే నీదమ్మ