歌曲 / 歌词

Adire Hrudayam

Listen on Apple Music

歌词

అదిరే హృదయం
అదిరే అధరం
మధురం మధురం
నీతో జత
ముదిరే ప్రణయం
ముసిరే ప్రళయం
కరిగే పరువం
నీ కౌగిట
నీ వలపుల ఒడిలో
తలపుల సుడిగాలిలో
కడతేరనా
ప్రియా ప్రియా సఖీ ప్రియా
భ్రమా నిజం తెలియని వరమా
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణకాలమా
♪
అందాల ఆడ సింహమా
చందనాల శిల్పమా
కోడెనాగు వేగమా
నన్నే చేరి నీవుగా
నీతో ఆడే ఆటలే
ముద్దుల్లొ సాగే వేటలే
పగ్గాలు వీడి స్వర్గాలు దాటేయనా
మహా మహా అగాధమా
నిన్నే నిన్నే తెలియగ తరమా
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణకాలమా
♪
చల్లారిపోకె మోహమా
మంటలాగ రేగుమా
కంటనీరై జారుమా
నరాల్లోని నాధమా
నువ్వే నాతో లేనిదే
నాలోన ఏకం కానిదే
ఈ లోకమంతా నా కంటికి శూన్యమే
ఇదే ఇదే సుఖం ఇదే
ఇహం పరం ఇపుడిక మనదే
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణకాలమా
అదిరే హృదయం
అదిరే అధరం
మధురం మధురం
నీతో జత
నీ వలపుల ఒడిలో
తలపుల సుడిగాలిలో
కడతేరనా
ప్రియా ప్రియా సఖీ ప్రియా
భ్రమా నిజం తెలియని వరమా
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణకాలమా