歌曲 / 歌词

Avayi Tuvvayi

Listen on Apple Music

歌词

అవ్వాయి తువ్వాయీ అల్లాడే అమ్మాయీ
అవ్వాయి తువ్వాయీ ఖిల్లాడీ అబ్బాయీ
దాగీ దాగని సోకే బరువయీ
ఆగీ ఆగని ఈడే ఇరుకయి
తాకీ తాకని చూపే చినుకయీ
దూకీ దూకని ఊపే వరదైయి
ఏం చేస్తుందో, ఎలా ముంచేస్తుందో,
అయ్యో రామా అస్సలిదేం లడాయీ
అవ్వాయి తువ్వాయీ అల్లాడే అమ్మాయీ
పాలోసి పెంచా ప్రతి భంగిమా
పోగేసి ఉంచా పురుషోత్తమా
అమాంతం తెగిస్తే సమస్తం తమకేగా
కంగారు పెట్టే సింగారమా
బంగారమంతా భద్రం సుమా
ప్రమాదం తెలిస్తే సరదాపడతావా
ఎన్నాళ్లీ గాలిలో తిరుగుడు
ఇలా నా ఒళ్లో స్థిరపడే దారిచూడు
బాలమణి! సరే కానీ మరి, పద చెల్లిస్తా ప్రతి బకాయీ
అవ్వాయి తువ్వాయీ ఖిల్లాడీ అబ్బాయీ
తెగ రెచ్చిపోకే పసి పిచ్చుకా
నన్నాపలేదే నీ ఓపిక
పిడుగై పడనా వ్రతమే చెడినాక
చిర్రెత్తి వస్తే మగపుట్టుక
సుకుమారమిస్తా సుఖపెట్టగా
ఒడిలో పడనా వరమే అడిగాక
కవ్వింతలెందుకే బాలికా
మరీ పువ్వంటి సున్నితం కందిపోగా
చిచ్చౌతావో, నువ్వే చిత్తౌతావో,
ఎటూ తేలందే ఇదేం బడాయీ
అవ్వాయి తువ్వాయీ ఖిల్లాడీ అబ్బాయీ
దాగీ దాగని సోకే బరువయీ
ఆగీ ఆగని ఈడే ఇరుకయి
తాకీ తాకని చూపే చినుకయీ
దూకీ దూకని ఊపే వరదైయి
ఏం చేస్తుందో ఎలా ముంచేస్తుందో
అయ్యో రామా అస్సలిదేం లడాయీ