歌曲 / 歌词

Swaasalona Desame

Listen on Apple Music

歌词

శ్వాసలోన దేశమే (శ్వాసలోన దేశమే)
గుండె ఘోషలోన దేశమే (ఘోషలోన దేశమే)
ప్రాణ నాడిలోన దేశమే
ప్రాణమంత తల్లి కోసమే
మాటలోన దేశమే (మాటలోన దేశమే)
కత్తి వేటులోన దేశమే(కత్తి వేటులోన దేశమే)
కాలి అడుగులోన దేశమే
కాలి బూడిదైన తల్లి కోసమే
దేశమే నువ్వురా... సందేశమయ్యెరా (దేశమే నువ్వురా)
దేశమే నువ్వురా... సందేశమయ్యెరా (సందేశమయ్యెరా)
చిన్నారి ప్రాయమందునా
కన్నోళ్ళనొదిలినావురా (కన్నోళ్ళనొదిలినావురా)
కన్నీట పదును తేలెరా
ఖడ్గమే... ప్రయాణమైన పోరులో (ప్రయాణమైన పోరులో)
ప్రేమింక ఇంకిపోయెరా (ప్రేమింక ఇంకిపోయెరా)
దోసిట్లో దాచినావురా... సంద్రమే
ప్రజల స్వేఛ్చకై ప్రాణాలనొదులుతూ పతాకమల్లె ఎగిరినావురా
దేశమే నువ్వురా... సందేశమయ్యెరా (దేశమే నువ్వురా)
దేశమే నువ్వురా... సందేశమయ్యెరా (సందేశమయ్యెరా)
దేశమే నువ్వురా... సందేశమయ్యెరా (దేశమే నువ్వురా)
దేశమే నువ్వురా... సందేశమయ్యెరా (సందేశమయ్యెరా)