歌曲 / 歌词

Baba Sai Baba

Listen on Apple Music

歌词

బాబా... సాయి బాబా బాబా... సాయి బాబా
నీవూ మావలె మనిషివనీ
నీకూ మరణం ఉన్నదనీ
అంటే ఎలా నమ్మేదీ అనుకొని ఎలా బ్రతికేదీ
బాబా... సాయి బాబా బాబా... సాయి బాబా
నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడూ
నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడూ
నువ్వే దేవుడివైతే ఆ మృత్యువెలా శాసిస్తాడూ
తిరుగాడే కోవెల నీ దేహం శిథిలంగా అవుతుందా
పిలిచినంతనే పలికే దైవం మూగైపోతాడా
బాబా... సాయి బాబా బాబా... సాయి బాబా
నీవూ మావలె మనిషివనీ
నీకూ మరణం ఉన్నదనీ
అంటే ఎలా నమ్మేదీ అనుకొని ఎలా బ్రతికేదీ
బాబా... సాయి బాబా బాబా... సాయి బాబా
దివిలో ఉన్నా భువిలో ఉండే మాకై నింగిని చీల్చుకురా
దిక్కులలోనా ఎక్కడ ఉన్నా ముక్కలు చెక్కలు చేసుకురా
దివిలో ఉన్నా భువిలో ఉండే మాకై నింగిని చీల్చుకురా
దిక్కులలోనా ఎక్కడ ఉన్నా ముక్కలు చెక్కలు చేసుకురా
సూర్యచంద్రులను చుక్కల గుంపును కూల్చీ రాల్చీ రావయ్యా
గ్రహములు గోళాలిహ పర శక్తులు గగ్గోలెత్తగ రావయ్యా
నువు లేకుంటే నువు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం
నువు లేకుంటే నువు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం
లయం వచ్చి ప్రపంచమంతా నాశనం అయిపోనీ
ముల్లోకాలూ కల్లోలాల్లొ శూన్యం అయిపొనీ
కదిలే కాలాగ్నీ ఎగసే బడబాగ్నీ
దైవం ధర్మాన్నీ దగ్ధం చేసేవీ
నేనే ఆత్మైతే నీవే పరమాత్మా
నీలో నన్ను ఐక్యం అయిపోనీ... పోనీ