歌曲 / 歌词

Gurthukostunnayi

Listen on Apple Music

歌词

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగ పలకరిస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ
రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ
కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు
దొంగచాటుగా కాల్చిన బీడీ సుబ్బుగాడిపై చెప్పిన చాడీ
మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
మొదట సారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం
నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న
పంచుకున్న ఆ పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు
చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారుకెగవేసిన అప్పు
మొదటి ముద్దులో తెలియని తనము మొదటి ప్రేమలో తియ్యందనము
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
సాహిత్యం: చంద్రబోస్: నా ఆటోగ్రాఫ్: యమ్.యమ్.కీరవాణి:యమ్.యమ్.కీరవాణి