歌词
వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా
వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా
కళ్ళలోనా పొంగుతున్నా బాధలెన్నో మాకున్నాయ్
గుందేలోనా దాచుకున్న గాధలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా భాద తీరుస్తారా
గాలి వానా లాలి పాడేస్తారా
♪
పిల్ల పాపలా వానా
బుల్లి పడవలా వానా
చదువు బాదలే తీర్చీ సెలవులిచ్చిన వానా
గాలి వానా కాబాడీ
వేడి వేడి పకోడి
ఈడు జోడు డీ డీ డీ డీ
తోడుండాలి ఓ లేడి
ఇంద్ర ధనస్సులో తళుకు మనే యెన్ని రంగులో
ఇంటి సొగసులే తడిసినవి నీటి కొంగులో
శ్రావణ మాసాలా జల తరంగం
జీవన రాగాలా కిది ఓ మృదంగం
కళ్ళలోనా పోంగుతున్నా బాదలెన్నో మాకున్నాయ్
గుందేలోనా దాచుకున్న గాధలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా భాద తీరుస్తారా
గాలి వానా లాలి పాడేస్తారా
♪
కోరి వచ్చిన ఈ వానా
గోరు వెచ్చనై నాలోన
ముగ్గులా సిగ్గు ముసిరేస్తే
ముద్దు లాటలే మురిపాలా
మెరిసే మెరిసే అందాలు
తడిసే తడిసే పరువాలూ
గాలి వానలా పందిళ్ళూ
కౌగిలింతలా పెళ్ళిళ్ళూ
నెమలి ఈకలో ఉలికి పడే యెవరి కన్నుల్లో
చినుకు చాటునా చిటికేలతో యెదురు చూపులో
నల్లని మేఘాలా మెరుపులందం
తీరని దాహాలా వలపు పందెం