歌曲 / 歌词

Chandamama Chandamama

Listen on Apple Music

歌词

చందమామ చందమామ అంతదూరం ఎందుకమ్మ
కన్నెభామ కన్నెభామ ఆపవే హంగామా
చందమామ చందమామ అంతదూరం ఎందుకమ్మ
కన్నెభామ కన్నెభామ ఆపవే హంగామా
హై రామ అందుకోమ్మా అలుసా చెలిప్రేమ
అయ్యొరామ కుట్టకమ్మ కులుకుల చలిచీమ
తగదమ్మ మగజన్మ మొగమాటమా
చందమామ చందమామ అంతదూరం ఎందుకమ్మ
కన్నెభామ కన్నెభామ ఆపవే హంగామా
అన్నీ ఇస్తా అన్నాక అర్థంగా అవుననక
ఆలోచిస్తానంటావా అంతుచూడక
అంతో ఇంతో బిడియంగా తలవంచుకు నిలబడక
కంచే తెంచుకు వస్తావా ముందు వెనుక చూడక
సిగ్గే సిగ్గు పడి తప్పుకుంది చాటుగా
అగ్గై వెంటపడీ అంటుకోకె అన్యాయంగ
చందమామ చందమామ అంతదూరం ఎందుకమ్మ
కన్నెభామ కన్నెభామ ఆపవే హంగామా
కొంచెం అలవాటయ్యాక రెచ్చిపోతే పద్ధతిగా
అంతేగానీ ఇంతిదిగా ఇదేం వేడుకా
మీసం రోషం నచ్చాకే మనసిచ్చా ముచ్చటగా
మీనం మేషం లెక్కెడుతూ జారిపోకు చల్లగా
సరదా తీరుస్తా సత్తువెంతొ చూడవే
పెదవే అందిస్తా మాటలాపి ముందుకు రావె
కన్నెభామ కన్నెభామ ఆపవే నీ హంగామా
చందమామ చందమామ అంతదూరం ఎందుకమ్మ
అయ్యొరామ కుట్టకమ్మ కులుకుల చలిచీమ
హై రామ అందుకోమ్మా అలుసా చెలిప్రేమ
తగవమ్మా తగువాడే చెలగాటమా