歌曲 / 歌词

Ie Kshanamaina

Listen on Apple Music

歌词

కలనైనా క్షణమైనా మాయనిదే మన ప్రేమా మన ప్రేమా
కలకాలం కావ్యంలా నిలిచేదే మన ప్రేమా మన ప్రేమా
కలనైనా క్షణమైనా
నీ కళ్ళల్లో తొంగి చూడనిదే నిదురేది ఆ రేయి నా కళ్ళకు
నీ కళ్ళల్లో తొంగి చూడనిదే నిదురేది ఆ రేయి నా కళ్ళకు
నీ పాట మనసారా పాడనిదే నిలకడ ఏదీ నా మనసుకూ
నీ పాట మనసారా పాడనిదే నిలకడ ఏదీ నా మనసుకూ
ఊపిరిలో ఊపిరిలా ఒదిగేదే మన ప్రేమా
కలనైనా క్షణమైనా
నా చెంపకు ఎంతటి ఉబలాటమో నీ చెంపతో చెలగాటమాడాలని
నా చెంపకు ఎంతటి ఉబలాటమో నీ చెంపతో చెలగాటమాడాలని
నా పెదవికి ఎంతటి ఆరాటమో నీ పెదవిపై శుభలేఖ రాయాలని
నా పెదవికి ఎంతటి ఆరాటమో నీ పెదవిపై శుభలేఖ రాయాలని
కౌగిలిలో కౌగిలిలా కరిగేదే మన ప్రేమా
కలనైనా క్షణమైనా