歌词
ఎంత ఆకలి గొంటివో
ఎంత ఆకలి గొంటివో నా వెంకట కిషోర, వకుళనై
అన్నము తినిపింతు ఆరగించరా కడుపారా
నీ జఠరాగ్నినాదమాయే, మొదటి ఘంటారవముగా
నా మమతలాయే నైవేద్యములు పొంగలి పెరుగన్నములుగా
చెడు దృష్టి నీకు సోకకుండా గుడి తలుపులు వేసితిమయా
మంత్రోక్తముగా ఆరగింపు చేసితి నా భాగ్యముగా
II ఎంత II
గోరుముద్దలే పెడతాను నోరు తెరవరా నా కన్నా
నీకోముద్దా సిరికోముద్దా చివరి ముద్దేమో నాకన్నా
జగన్నాయకా నీవారగింప సకలలోకములు శాంతించు
ఈ ప్రసాదములు స్వీకరించు ఈ భక్తుల జన్మలు తరియించు
II ఎంత II