歌曲 / 歌词

Nuvve Nuvve

Listen on Apple Music

歌词

నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
పదే పదే పిలిచే ఈ గానం
ప్రతిచోట నీ కోసం వెతుకుతుండగా
కనుల్లోన నీ రూపం వెలుగుతుండగా
మనస్సంతా మల్లెల జలపాతం
నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
పదే పదే పిలిచే ఈ గానం
తరుముతు వచ్చే తీయని భావం
ప్రేమో ఏమో ఎలా చెప్పడం
తహ తహ పెంచే తుంటరి దాహం
తప్పో ఒప్పో ఏం చెయ్యడం
ఊహల్లో ఊయ్యాలూపే సంతోషం రేగేలా
ఊపిర్లో రాగం తీసే సంగీతం సాగేలా
అలలై పిలిచే ప్రణయ సుప్రభాతం
నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
పదే పదే పిలిచే ఈ గానం
ఎవరెవరంటూ ఎగిసిన ప్రాయం
నిన్నే చూసి తలొంచే క్షణం
నిగనిగమంటూ నీ నయగారం
హారం వేసి వరించే క్షణం
స్నేహాల సంకెళ్ళే అల్లేసే కౌగిల్లో
పారాణి పాదాలే పారాడే గుండెల్లో
నడకే మరిచి శిలయ్యింది కాలం
నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
పదే పదే పిలిచే ఈ గానం
ప్రతిచోట నీ కోసం వెతుకుతుండగా
కనుల్లోన నీ రూపం వెలుగుతుండగా
మనస్సంతా మల్లెల జలపాతం
నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
పదే పదే పిలిచే ఈ గానం