歌词
ఓ కలా
ఓ కలా
చూడకే అలా
హేయ్ ఇలా నీ వలా అల్లితే ఎలా
మరో ప్రపంచమే అలా వరించగా
పరుగులు తీసే నా ఎదకీ నిలకడ నేర్పేదెలా
కుదురుగ ఉంటె మంచిదనీ వెనకకి లాగేదెలా
ఓ కలా
ఓ కలా చూడకే అలా
♪
కనులె వెతికే వెలుతురు నీదనీ
ఇపుడే ఇపుడే తెలిసినదీ
తననే పిలిచే పిలుపులు నీవనీ
వయసిపుడే తేల్చుకున్నదీ
నిదురకి చేరితే జోల నువే
మెలుకువ వచ్చినా ఎదుట నువే
ఇక నిను వీడటం ఏలా
అదెలా
ఓ కలా
ఓ కలా
చూడకే అలా
♪
ఎడమ కుడిలో ఎవరూ లేరనీ
ఒనికే పెదవే పలికినదీ
నిజమే పలికే చొరవని చెయ్మనీ
నసిగినదీ నాంచకన్నదీ
మనసుకి చేరువా ప్రతి ఒకరూ
మనకిక దూరమే అని బెదురూ
మరి నిను చేరడం ఎలా
అదెలా
ఓ కలా
ఓ కలా
చూడకే అలా