歌词
దేవుడే దిగివచ్చిన
స్వర్గమే నాకిచ్చిన
షాజహాన్ తిరిగొచ్చిన
తాజ్మహల్ రాసిచ్చిన
ఇప్పుడీ సంతోషం ముందర
చిన్నబోతాయి అన్ని కదరా
లోలోన మనసంతా సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే
లోలోన మనసంతా సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే
♪
వెన్నెల చూడు నన్నిలా ఎంత హాయిగా ఉంది ఈ దినం
నమ్మవ నన్ను నమ్మవ చేతికందుతు ఉంది ఆకాశం
ఇప్పుడే పుట్టినట్టుగా ఎంత బుజ్జిగా ఉంది భూతలం
ఎప్పుడు ముందరేప్పుడు చూడలేదిలా దీని వాలకం
ప్రేమొస్తే ఇంతేనేమో పాపం
దాసోహం అంటుందేమో
వంగి వంగి ఈ లోకం
♪
కోయిల నేర్చుకోయిల ఆమె నవ్వులో తేనే సంతకం
హాయిగా పీల్చుకోయిల చల్లగాలిలో ఆమె పరిమళం
నీటిపై చందమామలా నేడు తేలుతూ ఉంది నా మది
చీటికీ మాటి మాటికీ కొత్త కొత్తగా ఉంది ఏమది
అణువంతే ఉందమ్మా ప్రేమ
అణచాలి అనుకున్నాము చేస్తుందమ్మా హంగామా
దేవుడే దిగివచ్చిన
స్వర్గమే నాకిచ్చిన
షాజహాన్ తిరిగొచ్చిన
తాజ్మహల్ రాసిచ్చిన
ఇప్పుడీ సంతోషం ముందర
చిన్నబోతాయి అన్ని కదరా
లోలోన మనసంతా సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే
లోలోన మనసంతా సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే