歌曲 / 歌词

Nee Kopam

Listen on Apple Music

歌词

నీ కోపం క్షణం అనుకుంటాను
నీతో నేనొక యుగం ఉంటాను
నాపై అలకే చూపెడితె ఏమౌతా
నీలోనె నేననుకున్నాను
వేరేగా లేననుకుంటానూ
నన్నే కాదనుకుంటే నేనేంచేస్తా
నా కన్నుల్లో బొమ్మవు నువ్వూ
నా గుండెల్లో తోడువు నువ్వూ
నాలో ఉన్నది ప్రతి అణువు నీ ప్రేమా
నా పెదవుల్లో మాటవు నువ్వూ
నా అడుగుల్లో నడకవు నువ్వూ
నీలో నాలో ఉన్నది ఒకటే ప్రేమా
♪
నిన్ను చూస్తూవుంటే చాలు
చిన్న బోవా మందారాలు
వెన్నల్లంత మూట కడితే నువ్వే అంటానూ
చేతిలోన చెయ్యే వేసి
నీడలా నువ్వుంటే చాలు
ఇంత లాగ వెంట పడుతూ పొగొడొద్దంటాను
నీ నీలికళ్లే నీలాకాశం అంటున్నా
కలనైనా నిన్ను వదిలి ఒంటరిగా లేనూ
ఈ లోకమంతా నన్నే కాదని అనుకున్నా
నా లోకమే ఇక నీవని నిన్నే చేరనా
మంచువో మత్తువో యదను వదలదు నీ ధ్యాసా
హాయివోమాయవో మనసు కదలదు నువ్వు లేకా
ఏ మంత్రం వేసావిలా
నీ కోపం క్షణం అనుకుంటానూ
నీ తోనేనొక యుగం ఉంటాను
నాపై అలకే చూపెడితె ఏమౌతా
నీలోనె నేననుకున్నాను
వేరేగా లేననుకుంటానూ
నన్నే కాదనుకుంటే నేనేంచేస్తా
♪
నీటిలో చిరు ముత్యంలాగా
నేలపై తొలి పచ్చికలాగా
నువ్విలా నా పక్కన వుంటే ఎంతో ఆనందం
రామచిలకకు గోరింకల్లే
తార పక్కన చంద్రుడి మల్లే
ఇద్దరం ఇక ఒకటైపోతే ఇంకెంతో అందం
నీ కళ్లతోనే ఈ లోకం మొత్తం చూస్తున్నా
ప్రతి నిమిషం నీ తోనే గడిపేస్తూ ఉన్నా
నీ మాటలోనే తీయని భాషే వింటున్నా
పలవరించీ నీ పేరే జపమే చేస్తున్నా
ఊపిరే నీదిలే నన్ను కాదని అనకెపుడూ
ప్రాణమే లేదులే నువ్వు జంటగ లేనపుడూ
నూరేళ్లు సాగేందుకూ
నీ కోపం క్షణం అనుకుంటానూ
నీతో నేనొక యుగం ఉంటాను
నాపై అలకే చూపెడితె ఏమౌతా
నీలోనె నేననుకున్నాను
వేరేగా లేననుకుంటానూ
నన్నే కాదనుకుంటే నేనేంచేస్తా
నా కన్నుల్లో బొమ్మవు నువ్వూ
నా గుండెల్లో తోడువు నువ్వూ
నాలో ఉన్నది ప్రతి అణువు నీ ప్రేమా
నా పెదవుల్లో మాటవు నువ్వూ
నా అడుగుల్లో నడకవు నువ్వూ
నీలో నాలో ఉన్నది ఒకటే ప్రేమా