歌曲 / 歌词

Tiya Tiyani Kalalanu

Listen on Apple Music

歌词

తియతియ్యని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో
ఎన్నాళ్ళైనా నేనుండిపోగలను నీ కౌగిళ్ళలో
నేనెవరన్నది నే మరిచిపోగలను చూస్తూ నీ కళ్ళలో
తియతియ్యని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో
♪
చలచల్లని మంచుకు అర్థమేకాదు ప్రేమ చలవేమిటో
నునువెచ్చని మంటలు ఎరగవేనాడు ప్రేమ సెగలేమిటో
వచ్చీరాని కన్నీళ్లకే తెలుసు ప్రేమ లోతేమిటో
ముద్దేలేని అధరాలకే తెలుసు ఈడు బాధేమిటో
తియతియ్యని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో
♪
మురిపెంతో సరసం తీర్చమంటోంది ప్రాయమీవేళలో
తమకంతో దూరం తెంచమంటోంది తీపి చెరసాలలో
విరహంతో పరువం కరిగిపోతోంది ఆవిరై గాలిలో
కలిసుంటే కాలం నిలిచిపోతుంది ప్రేమ సంకెళ్ళలో