歌词
మెరిసేటి జాబిలి నువ్వే, కురిసేటి వెన్నెల నువ్వే
నా గుండెల చప్పుడు నువ్వే oh my oh my love
నను love లో దించేశావ్
మనసైనవాడివి నువ్వే, ప్రియమైన తోడువి నువ్వే
నా కన్నుల కాంతివి నువ్వే oh my oh my love
నను మైమరిపించేశావ్
Oh my oh my love tell me tell me now
నా మీదుండే love ఏమిటంటుంది
ఏమేమి అడిగింది
ప్రేమ ఇమ్మంది, ప్రేమందుకొమ్మంది
మెరిసేటి జాబిలి నువ్వే, కురిసేటి వెన్నెల నువ్వే
నా గుండెల చప్పుడు నువ్వే oh my oh my love
నను love లో దించేశావ్
అల్లుకో బంధమా
ఒంటరి అల్లరి తీరేలా జతకానా జవరాలా
ఆదుకో ప్రణయమా
తుంటరి ఈడును ఈవేళ ఓదార్చనా ప్రియురాలా
నా ఆశలన్నీ నీకోసమంటూ నీ దారి చూడనీ
నా శ్వాసలోని రాగాలు అన్నీ నీ పేరు పాడనీ
మసక చీకట్లలో నా మనసు అందించనీ
Oh my oh my love tell me tell me now
నా మీదుండే love ఏమిటంటుంది
ఏమేమి అడిగింది
ప్రేమ ఇమ్మంది, ప్రేమందుకొమ్మంది
మనసైనవాడివి నువ్వే, ప్రియమైన తోడువి నువ్వే
నా కన్నుల కాంతివి నువ్వే oh my oh my love
నను మైమరిపించేశావ్
కలిసిరా అందమా
చుక్కల వీధిన విహరిద్దాం, స్వర్గాలను చూసొద్దాం
కరగవే సందేహమా
చక్కగ దొరికెను అవకాశం, సరదాగా తిరిగొద్దాం
నీ వాలు కనులు నాపైన వాలి నను మేలుకొలపనీ
నీ వేలికొనన నా మేను తాకి వీణల్లే మీటనీ
వయసు వాకిళ్లలో తొలివలపు వెలిగించనీ