歌词
సొట్ట బుగ్గల రుక్కుమిని
పిట్ట సొగసులేసుకుని గట్ట దాటి ఊపుకుంటు పోతే
నక్క బావ నిన్నుగని చుక్క భలేగున్నదని గంప లోన దూరి గోల చేస్తే
పొంగును వరద అంటును బురద తీరును దురద
మరి సరదా వినవే.
పగిలిన పలకా ఓసి పిలకా పని చమకు చమకు...
ఆడపిల్ల చేపపిల్ల తీరుగుంటే అగ్గిపుల్ల జారిపోతే సబ్బుబిల్ల తొక్కుడుబిల్ల
చూడుమల్ల జింకపిల్ల కొమ్మమీది కోతిపిల్ల గంప కింద కోడిపిల్ల దూకకేమళ్ళ
//సోట్ట బుగ్గల//
రావే నా కండ్రకాయ్.
రోషమొచ్చి మాధవుడే మీసం మెలివేస్తే ఆయ్. ఆయ్.
కాసులున్నా కంసులంతా ఖంగుతినేనంతే ఆయ్.ఆయ్.
గోడమీది జారుడు బల్లి
మంచాన్నున్న నొక్కుడు నల్లి
కుక్క తోక బుధ్ధినీది జిడ్డు మంగ
రొయ్య మీసం పొగరు చూసి
కొత్తిమీర ఫిగరు చూసి ఊడదయ్య ఈక కూడ ఊరి దొంగ
కీచు కీచు పిట్ట నేలకేసీ కొట్ట
అందుకుంటే జుట్టా అందకుంటే బెట్టా
పాలకొల్లు ఫూలన్ దేవి ఇట్టాగైతేె ఎట్ట
ఆలీబాబా బ్రదరా షోభరాజు కజినా అదరహొ అరడజను గజదొంగల జోరు.
గిత్త పొగరు రుక్కుమిని గుంటనక్కకు తల్లివని సూర్యకాంతం చెల్లివని తెలుసులే మాకు/2/
నూతిలోని కప్పను తీసి సుత్తపెట్టి సొట్టలు వేసి గీర పెంచి మలిచాడంమా నిన్ను బ్రహ్మ
కొండముచ్చు వేషలేసి గండుపిల్లిలా గోడలు దూకి దొంగకోళ్ళు పట్టాడమ్మ ఏమి జన్మ
విశ్వదాభిరామ ఇసుకేసి తోమా బూజు పట్టెనమ్మ బుజ్జీ సత్యభామ
బొడ్డుకున్న తాళం తీస్తే సర్దుకుంటదమ్మ
అరుపుల శునకం కరవదు గనక చీపురు తిరగేసిన పరిగెత్తును ఓయ్...
సిగ్గులేమో శ్రీకాకుశం ఆట చూస్తే అమలాపురం బుధ్ధి నీది స్టువర్టుపురం తెలుసులె పోరా...
చుక్క చూస్తే చెన్నపట్నం పిట్ట దాటి మచిలీపట్నం మెలిక పెట్టె మెహన్దీపట్నం చూసాం పోరా...
//సొట్ట బుగ్గల//
//సిగ్గులేమో//